డిసిపల్లిలో 'జగనన్న ఆరోగ్య సురక్ష'
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని డిసిపల్లి సచివాలయంలో వైసిపి మండల కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబం దగ్గరకు వైద్యులను ఆరోగ్య కార్యకర్తలను పంపడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుత జీవన శైలి మార్పులతో దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో వాటిని గుర్తించి మెరుగైన వైద్య సహాయం అందిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 7రకాల పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలను గుర్తించి రూపాయి ఖర్చు లేకుండా సంపూర్ణ వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వైద్య శిబిరంలో పలు రకాల పరీక్షలతో పాటు కంటి సంబంధిత పరీక్షలను నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ నాగమణి, తహశీల్దారు ఆనందరావు, సర్పంచ్ రేవూరు సుప్రజ, నందవరం సర్పంచ్ రామ్మోహన్, వైసిపి నాయకులు చిట్టెం శ్రీను, రేవూరు గోపి, మండల వైద్యాధికారి డాక్టర్ గోపీనాథ్, వైసిపి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చెవుల శ్రీనివాసులు యాదవ్, గ్రామ సచివాలయ, వైద్య, ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.










