Mar 05,2023 21:06

ప్రజాశక్తి - ఉండి
దిశా యాప్‌ మహిళల పాలిట బ్రహ్మాస్త్రమని ఎఎస్‌ఐ అడబాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం చెరుకువాడ గ్రామంలో దిశా యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఎస్‌ఐ అడబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి మహిళా తమ ఫోన్లలో దిశా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. దిశా యాప్‌ ఆపద సమయంలో ఐదుగురు స్నేహితులకు, పోలీసులకు సమాచారం చేరవేసే విధంగా ప్రారంభించినట్లు తెలిపారు. ప్రయాణ సమయంలో ట్రాక్‌ మై ట్రావెల్‌ ఆప్షన్‌ ఉంటుందని దాని ద్వారా చేరాల్సిన గమ్యాన్ని ఎల్లప్పుడూ ట్రాక్‌ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.