Sep 14,2023 23:05

డిప్యూటీ సీఎంకు వైసిపి నాయకుల శుభాకాంక్షలు

డిప్యూటీ సీఎంకు వైసిపి నాయకుల శుభాకాంక్షలు
ప్రజాశక్తి కార్వేటినగరం : రాష్ట్ర డిప్యూటీ సీఎం కళాత్తూరు నారాయణ స్వామికి గురువారం పెళ్లి రోజు సందర్భంగా మండల జెసిఎస్‌ కన్వీనర్‌ పురంధర్‌, సర్పంచ్‌ గుణవతి లోకనాథం నాయుడు, స్వీట్లు పండ్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని పదవులు పొంది నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరారు. వీరి వెంట సింగిల్‌ విండో డైరెక్టర్‌ ఏకాంబరం, శేఖర్‌ ఉన్నారు.
ప్రజాశక్తి -వెదురుకుప్పం:డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామికి వెదురుకుప్పం వైసిపి నాయకులు పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం పెరుమాళ్ళపల్లె ఎంపీటీసీ తోకల మురళి ఆధ్వర్యంలో ఆయన నివాసానికి వెళ్లి ఆ దంపతులకు రోజు శుభాకాంక్షలు తెలియజేసి శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం ఎంపీటీసీ రాధిక పురంధర్‌ రెడ్డి, ఎస్‌ఆర్‌ పురం మార్కెట్‌ కమిటీ మెంబర్‌ గఫూర్‌ పాల్గొన్నారు.