Mar 29,2022 21:32

సమావేశంలో మాట్లాడుతున్న శిక్షణ మండలి లెక్చరర్‌ డేవిడ్‌ దాసరపల్లి

ప్రజాశక్తి - క్యాంపస్‌ : నూతన జాతీయ విద్యా విధానంలో డిజిటల్‌ తరగతులకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని ప్రతి ఉపాధ్యాయడు డిజిటల్‌ టెక్నాలజీని తమ బోధనలో వినియోగించుకోవా ల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి లెక్చరర్‌ డేవిడ్‌ దాసరపల్లి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, జిల్లా విద్యాశాఖ, సి.కె.దాస్‌ ఎడ్యుకేషన్‌ ఆకాడెమీ, రీజనల్‌ సైన్స్‌ సెంటర్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆఫ్‌ టీచింగ్‌ స్కిల్స్‌ టు డిజిటల్‌ స్కిల్స్‌ అన్న అంశంపై జరిగిన కార్యశాలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
అదేవిధంగా ఆప్‌ కాస్ట్‌ ఆధ్వర్యంలో గతంలో కోడింగ్‌ తరగతులు నిర్వహించామని, నేడు 'గేమింగ్‌ ఇన్‌ విద్యా కేషన్‌ శిక్షణ ఇస్తున్నామని, నేడు ఆఫ్‌ లైన్‌లో డిజిటల్‌ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వడం జరుగుతోందనీ అప్‌కాస్ట్‌ ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా సమన్వయకర్త కుమారస్వామి నల్లా తెలిపారు. చిత్తూరు జిల్లాలో డిఇఒ సూచనల మేరకు డిజిటల్‌ కంటెంట్‌ మేకింగ్‌ మీద శిక్షణ ఇవ్వడంలో చాలామంది టీచర్లు డిజిటల్‌ వైపు మరలుతున్నారని వారికోసం టి పాక్‌ అనగా కంటెంట్‌ పెడగాజి టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌ కార్యశాల నిర్వహించామని జిల్లా కో - ఆర్డీనేటర్‌ నీలకంఠ తెలపారు. ఈ కార్యక్రమంలో రీజనల్‌ సైన్స్‌ కో- ఆర్డినేటర్‌ బాలాజీ, స్టేట్‌ రిసోర్స్‌ మహమ్మద్‌ గౌస్‌, సురేష్‌, బాల చైతన్య, వెంకటరమణ, డైట్‌ లెక్చరర్‌ చెంగల్రాజు, హరీశంకర్‌, నెమిలేటి కిట్టన్న, యువశ్రీ మురళి, రవీంద్ర రెడ్డి, లెనినా డోరాతి, రవి, వాణిశ్రీ, 150 మంది టీచర్స్‌ పాల్గొన్నారు.