Jul 07,2022 22:43

డీపీఓ సేవలు మరువలేనివి : డీఆర్‌ఓ
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌

జిల్లా పంచాయతీ అధికారి దశరథరామిరెడ్డి గత ఏడాదిన్నర కాలంలో జిల్లాకు ఎన్నో సేవలు అందించారని, గ్రామ సచివాలయ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం జరిగిందని ఈ మార్పులకు అనుగుణంగా ఆయన అందించిన సేవలు మరువలేమని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.రాజశేఖర్‌ అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా పంచాయతీ అధికారి దశరథరామిరెడ్డి తిరుపతి జిల్లా ఉద్యానశాఖాధికారిగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆయనకు డిఆర్‌ఓ ఛాంబర్‌లో సన్మానం చేశారు. ఈకార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఇఆర్‌ డబ్ల్యు ఎస్‌.వెంకటరమణ, ఎస్‌ఈ పంచాయతీరాజ్‌ చంద్రశేఖర్‌రెడ్డి, డిపిఆర్‌సి షణ్ముగరామ్‌ తదితరులు పాల్గొన్నారు.