ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డిఇఒ సాయిరాం
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ అనంతపురం జిల్లా విద్యా శాఖ అధికారి సాయిరాంకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం ఇంట్లో ఉండగా అస్వస్థకు లోనై కిందపడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు హూటాహుటిన కేర్ అండ్ క్యూర్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు నిర్ధారించి వైద్య చికిత్సలు అందించారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయ సంఘాలు, అధికారులు, ఉపాధ్యాయులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఆరోగ్యంగా కోరుకుని క్షేమంగా రావాలని ప్రార్థించారు.










