ప్రజాశక్తి -తిరుపతి సిటీ
విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాను అందించేందుకు , అలాగే హోల్‌సేల్ మార్కెట్‌లో గరిష్ట విద్యుత్ కొనుగోళ్లను తగ్గించి , డిస్కాముల కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించే లక్ష్యంలో భాగంగా డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్ (డిఎస్‌ఎం) యాక్షన్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలనీ యోచిస్తోందని బిఇఇ డైరెక్టర్ పేర్కొన్నారు. తిరుపతిలో ఏపీ ఎస్పీడీసీఎల్ సమన్వయంతో ఎపి స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ డిస్కామ్ కెపాసిటీ బిల్డింగ్ పోర్గ్రామ్ ను నిర్వహించారు. ఏపీఎస్ ఈసిఎం అధికారులు ఏపీఎస్ పీడీసిఎల్ లో ఇంధన సామర్ధ్య కార్యక్రమాల గురించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసారు. ఈ వర్క్ షాప్ లో బిఇఇ డైరెక్టర్ మిలింద్ డియోర్ మాట్లాడుతూ, కనీసం 50 శాతం డీఎస్‌ఎం ప్రణాళిక అమలు చేసేలా డిస్కమ్‌లను ప్రోత్సహించడమే వర్క్‌షాప్ లక్ష్యమని చెప్పారు డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, జూనియర్ లైన్‌మెన్ (జెఎల్‌ఎం), గ్రౌండ్ స్టాఫ్‌కు శిక్షణ ఇవ్వాలన్నారు. డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్ ప్రయోజనాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించే విధంగా దీర్ఘ కాల చర్యలు తీసుకోవాలని కోరారు.










