నిరసనలు చేపడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
ప్రజాశక్తి- మదనపల్లె అర్బన్:
బుధవారం స్థానిక బిసెంట్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు మాట్లాడుతూ కష్టపడి డిగ్రీలు, పీజీలు చదువుకొని ఉద్యోగబాధ్యత్లో ఉన్న విద్యావంతులైన సచివాలయ కార్యదర్శులను మరుగుదొడ్ల ముందు కూర్చొని డబ్బులు వసూళ్లు చేయమనడం హేయమైన చర్య అని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని లేకుంటే సచివాలయ సిబ్బందిని కలుపుకుని పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి నవీన్‌కుమార్, భువనేశ్వరి, అంజలి, మమత, గురుమూర్తి, అనిల్, చైతన్య, లక్ష్మణ్, లోకేష్, తిరుమల పాల్గొన్నారు.










