పూల మొక్కను అందజేస్తున్న దృశ్యం
డిఆర్‌ఒగా ఎస్ లవన్న బాధ్యతలు స్వీకరణ
ప్రజాశక్తి-నెల్లూరు:జిల్లా నూతన రెవిన్య డివిజన్ అధికారిగా ఎస్.లవన్న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డిఆర్‌ఓ గా పని చేసిన సి.వెంకటనారాయణమ్మ నుండి బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఎం. హరి నారాయణన్, జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాధ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. డిఆర్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన లవన్న మీడియాతో మాట్లాడుతూ గతంలో చిత్తూరు కలెక్టర్‌గా ఎం.హరినారయణన్ పనిచేస్తున్న సమయంలో తాను ఆ ప్రాంతంలో గతంలో గుంతకల్లులో ఆర్‌డిఓగా పనిచేశామన్నారు. డిఆర్‌ఓగా జిల్లా కు తాను బదిలీ అయి రావడం.. ఈ ప్రాంతంలో కలెక్టర్‌గా ఎం.హరినారయణన్ పనిచేస్తుండటం సంతోషకరంగా ఉందన్నారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని, అందరితో సన్నిహితగా ఉంటూ , ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా విధులు నిర్వహిస్తామన్నారు.










