డెయిరీ కార్మికుల నిరసన
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ స్థానిక అమూల్ డెయిరీ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విజయ డెయిరీ కార్మికుల దీక్షలు ఆదివారానికి ఐదో రోజుకు చేరుకుంది. వేతనాల కోసం దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ డెయిరీ కార్మికులు అర్ధనగంగా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుని నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే తమ వేతన బకాయిలను చెల్లించాలని డెయిరీ కార్మికుల యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.










