ప్రజాశక్తి - గణపవరం
డెంగీపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పి.సంతోష్ నాయుడు తెలిపారు. మంగళవారం స్థానిక మూడో సచివాలయం వద్ద డెంగీ మాసోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోషనాయుడు మాట్లాడుతూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు నివారించవచ్చని చెప్పారు. సమిష్టి భాగస్వామ్యంతోనే డెంగీని నివారించవచ్చన్నారు. అనంతరం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో 195 మంది రోగులను పరీక్షించి మందులు అందజేశారు. 50వ విడత ఫీవర్ సర్వే గణపవరంలోని అన్ని సచివాలయాల్లో నిర్వహిస్తున్నట్లు తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి.లక్షణరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ జాలాది విల్సన్‌బాబు, ఎంఎల్‌హెచ్ పి.నున్నపాప పాల్గొన్నారు.










