May 12,2023 23:11

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి

       అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో డెంగీ వ్యాధిని కట్టడి చేసేందుకు ముందస్తు ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో మునిసిపల్‌ కమిషనర్లు, పంచాయతీ శాఖ, వైద్య శాఖ అధికారులతో జిల్లా స్థాయి కీటక జనిత వ్యాధుల నివారణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డెంగీ దోమలు వద్ధి చెందే ప్రాంతాలపై అధికారులు దష్టి సారించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో నీరు నిలిచినప్పుడు మలేరియా దోమలు వద్ధి చెందితే, కప్పి ఉంచిన నీళ్లలో డెంగీ దోమ ఎక్కువగా వద్ధి చెందుతుందన్నారు. పూర్తిగా పగల గొట్టని కొబ్బరి చిప్పలు, పాత టైర్లలో నిలిచిన నీళ్లు, మూసిఉన్న డ్రైనేజీ కాల్వలలో డెంగీ దోమలు వద్ధి చెందుతాయన్నారు. ఈ విషయంపై వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలని, ఎప్పటికప్పుడు మురికాల్వలను పరిశుభ్ర పరుస్తూ పారిశుధ్య డ్రైవ్‌లు నిర్వహించాలని అధికారులను అదేశించారు. డెంగీ కేసులు కనిపించిన గ్రామాల్లో హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో డెంగీ ప్రభలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డెంగీ యాక్షన్‌ ప్లాన్‌ అమలతో పాటు మున్సిపాలిటీల్లో చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కమిషనర్లకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి ఓబులు, మునిసిపల్‌ ఆర్దీ పీవీఎస్‌ఎస్‌ మూర్తి, డీఎంహెచ్‌వో వీరబ్బాయి, డీపీవో ప్రభాకర రావు, నగర మునిసిపల్‌ కమిషనర్‌ రమణా రెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి, మెప్మా పీడీ విజయలక్ష్మి, జిల్లా పరిశ్రమల అధికారి నాగరాజ రావు పాల్గొన్నారు.
'పది' విద్యార్థికి ప్రశంసాపత్రం
జిల్లా బీసీ సంక్షేమ హాస్టళ్ల పరిధిలో పదవ తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన ఏ.నవ్యకు కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి శుక్రవారం ఉదయం ప్రశంసా పత్రాన్ని అందించారు. బుక్కరాయసముద్రం బీసీ సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ బుక్కరాయ సముద్రం జెడ్పీ హై స్కూల్‌ లో పదవ తరగతి పూర్తి చేసి నవ్య పది అత్యుత్తమ మార్కులు సాధించింది. ఈ విద్యార్థితో పాటు 500కి పైగా మార్కులు సాధించిన 22 మందికి బీసీ సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులకు కలెక్టర్‌ ప్రశంశా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖుష్బు కొఠారి పాల్గొన్నారు.