బుక్కరాయసముద్రం : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని కొండమీదరాయుని దేవరకొండపై ఓ కారు సోమవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న అనంతపురానికి చెందిన శ్రీవిద్యానికేతన్ ప్రయివేటు పాఠశాల కరస్పాండెంట్ అక్కడికక్కడే మృతి చెందాడు.కాగ ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.? లేక కరస్పాండెంట్ ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.... అనంతపురం నగర్‌కు చెందిన శ్రీవిద్యానికేతన్ ప్రయివేటు పాఠశాల కరస్పాండెంట్ ఉమాపతి(56) సోమవారం ఉదయం డ్రైవర్‌తో కలిసి కారులో కొండమీద రాయుని స్వామి దర్శనానికి సోమవారం ఉదయం వెళ్లాడు. అక్కడ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో అనంతపురం బయల్ధేరారు. ఈ సమయంలో కాసేపు ఫోన్‌లో మాట్లాడుకోవాలంటూ ఉమాపతి డ్రైవర్ నుంచి కారు బయట ఉంచి కారు తలుపులు వేసుకున్నాడు. కొంత సేపటి తరువాత కారు అక్కడి నుంచి మందుకెళ్లి కొండపై నుంచి పల్టీలు కొడుతూ కిందపడింది. కొండపై నుంచి కారు కిందపడడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అందులో ఉన్న ఉమాపతి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగ ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.? లేక ఆయన ఆత్మహత్య చేసకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాపు చేస్తున్నారు. కొండపై నుంచి కారు పల్టీలు కొట్టే సమయంలో డ్రైవర్ తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది.










