Mar 29,2022 22:35

సమావేశంలో మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్‌


కోర్టు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారి
ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌:
గత 30 సంవత్సరాలుగా బంగారుపాలెం మండలం మహా సముద్రం పంచాయతీలో అరేటమ్మా, మహతిస్వర ఆలయాలకు చెందిన15 ఎకరాల దేవాలయ భూములను స్థానిక సర్పంచ్‌ షర్మిలారెడ్డి ఆమె భర్త మాజీ సర్పంచ్‌ కుమార్‌ రెడ్డి ఆక్రమించుకొని అనుభవిస్తున్నట్లు ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ సర్వేనెంబర్‌ 277/4, 78/ 78 అన్యాక్రాంతమైన భూములను కాపాడాలని దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. కోర్టును ఆశ్రయించగా భూములను స్వాధీనం చేసుకొని దేవాలయ అభివద్ధికి ఉపయోగించాలని ఆదేశించినా దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోలేదన్నారు. అధికారులు స్పందించి అన్యాక్రాంతమైన భూములు కాపాడాలని ఉన్నతాదికారులకు విజ్ఞప్తి చేశారు.