రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు
ప్రజాశక్తి - తిరుపతి సిటి, కుప్పం:
సిపిఐ కార్యాలయంలో కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం రవి, ఆర్.లక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మురళి, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా, కార్మిక చట్టాల రద్దును నిరసిస్తూ 'దేశాన్ని కాపాడుకుందాం.. ప్రభుత్వరంగాన్ని రక్షించుకుందాం' అంటూ చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలన్నారు. కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్, కార్మిక సంక్షేమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటకెక్కించాయన్నారు. రైతు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి. హేమలత, ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి కె రాధాకష్ణ సిఐటియు జిల్లా కోశాధికారి జి.బాలసుబ్రమణ్యం, సిఐటియు నగర అధ్యక్షులు టి. సుబ్రహ్మణ్యం, బుజ్జి, తంజావూరు మురళి, పరుశురాం, ఎన్జీవో అధ్యక్షులు సురేష్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గిరిబాబు, ఎన్ శ్రీరాములు పాల్గొన్నారు.
కుప్పం పార్కులోని కమ్యూనిటీ హాలులో అంగన్‌వాడీ నాయకురాలు ప్రమీల అధ్యక్షతన సిఐటియు విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సిఐటియు పశ్చిమ కమిటి జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్కీం వర్కర్లకు 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల సమ్మెలో పాల్గొని మోడీ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూరి, సరళ, చౌడమ్మ, మంజుల, హేమవతి, గుణశేఖర్, రాధ, కల్పన పాల్గొన్నారు.










