దేశం కార్యక్తలపై అక్రమ కేసులు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా గొడవలు సృష్టించారంటూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని టిడిపి రాష్ట్ర నాయకులు పాశం సునీల్‌కుమార్, మాజీ ఎంఎల్‌సి దొరబాబు అన్నారు. పుంగనూరు ఘటనలో ముద్దాయిలుగా చిత్తూరు సబ్‌జైల్లో ఉన్న టిడిపి నాయకులు, కార్యకర్తలను గురువారం తెలుగుదేశం నాయకులు దొరబాబు, సునిల్ కుమార్, మాజీ మేయర్ కఠారి హేమలత పరామర్శించారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ అధికార పార్టీ దాడుల కారణంగా పోలీసులు గాయపడ్డారని, ఉద్ధేశపూర్వంగా చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేయడమే కాకుండా తమ పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు.










