దేశాభివృద్ధికి విద్యే ఆయుధం
తల్లుల ఖాతాల్లోకి ' జగన్నన విద్యా దీవెన'
41,384 మందికి రూ.23.78కోట్లు : డిప్యూటి సిఎం
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్
పేదరికం నుండి బయటకు వచ్చేందుకు విద్య తోడ్పడుతుందని, అందుకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం విద్యారంగంలో పలు సంస్కరణలు చేపట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు కె.నారాయణస్వామి పేర్కొన్నారు. గురువారం జగనన్న విద్యాదీవెన మూడవ త్రైమాసిక నగదు బదిలీని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి బాపట్ల నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. జిల్లా స్థాయిలో ఈకార్యక్రమాన్ని స్థానిక అంబేద్కర్ భవన్‌లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జెడ్పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, చిత్తూరు ఎంఎల్‌ఏ ఆరణి శ్రీనివాసులు, నగర మేయర్ అముద, ప్రజాప్రతినిధులు, లబ్దిదారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్కరణలు చేపట్టి విద్యాభివద్ధికి కషి చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక మార్పులు చేపట్టారని అన్నారు. దీని ద్వారా తల్లిదండ్రులకు విద్య ఆర్థికభారం కాకుండా ఆ భారాన్ని ప్రభుత్వమే భరించేలా కషి చేస్తున్నారన్నారు. ఒక కుటుంబం ఎదగడానికి విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని అలాంటి విద్యారంగ అభివధి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని అంకితభావంతో కష్టపడి, ఇష్టంతో చదవాలని తెలిపారు. జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ జగనన్న విద్యాదీవెన పథకం క్రింద మూడవ త్రైమాసికంకు రాష్ట్ర వ్యాప్తంగా 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లు నేడు జమ కానున్నదని మన జిల్లాకు సంబంధించి జిల్లాలో రూ.23.78కోట్లు 41,384 వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమఅయినదని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుటుంబ పరిస్థితులు మెరుగుపడాలంటే అది విద్యతోనే సాధ్యం అవుతుందని అదే ఈ పథకం లక్ష్యం అని తెలిపారు. జగనన్న విద్యా దీవెన క్రింద నేడు జిల్లాలో రూ.23.78కోట్లు 41,384 వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేయడమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ ఎన్.రాజశేఖర్, చిత్తూరు ఆర్‌డిఓ డాక్టర్ రేణుక, బిసి వెల్ఫేర్ ఆఫీసర్ రబ్బానీ బాషా, జెడ్‌పిసి ఈఓ ప్రభాకర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










