Aug 14,2023 22:34

నా భూమి నా దేశం కింద వీరులను స్మరిస్తూ, వారికి వందనం చేస్తూ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి

       అనంతపురం కలెక్టరేట్‌ : ప్రతి ఒక్కరూ తమ వంతు సేవ చేస్తూ దేశ అభివద్ధికి పునరంకితమవ్వాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డా||పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణంలో ఆజాదీకా అమత్‌ మహోత్సవ్‌లో భాగంగా నా భూమి-నా దేశం నినాదంతో వసుధకు వందనం కింద నిర్వహించిన నేలతల్లికి నమస్కారం, వీరులకు వందనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, కలెక్టర్‌ ఎం.గౌతమి, జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ బోయ గిరిజమ్మ, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరి సాంబశివారెడ్డి, ఎడిసిసి బ్యాంకు ఛైర్‌పర్సన్‌ లిఖిత, ఆర్టీసీ రీజినల్‌ డైరెక్టర్‌ మంజుల, నగర మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయ భాస్కర్‌ రెడ్డి, వాసంతి సాహిత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నా భూమి నా దేశం కింద వీరులను స్మరిస్తూ, వారికి వందనం చేస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం దేశ రాజధానికి తరలించేందుకోసం జిల్లా నుంచి సేకరించిన మట్టి కలశాన్ని మంత్రికి కలెక్టర్‌ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కషి చేయాలన్నారు. దేశ వారసత్వ సంపదను చూసి వాటి అభ్యున్నతికి ఎల్లప్పుడూ కషి చేయాలన్నారు. దేశ ఐక్యత, ఐకమత్యం కోసం ఎల్లప్పుడూ పాటుపడాలన్నారు. దేశం పట్ల ప్రతి ఒక్కరూ తమ విధులను, బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల స్ఫూర్తితో దేశాన్ని రక్షించాలని, గౌరవించాలని, అభివద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, మెప్మా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ సీఈవో భాస్కర్‌ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.