Jul 16,2023 22:35

డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు
ప్రజాశక్తి - కాళ్ల

జన్మభూమి మీద మమకారంతో కాళ్లకూరు గ్రామంలో దాట్ల వెంకటరామరాజు తన కుమార్తె పేరు మీద దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని డిసిసిబి ఛైర్మన్‌, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. మండలంలోని కాళ్లకూరు గ్రామంలో దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ సహాయ నిధులు ద్వారా సుమారు రూ.13 లక్షలతో శ్రీ వెంకటేశ్వర పద్మావతి కోనేరుచెరువులో పూడిక తీత పనులను, మూడు రేవులను, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు పివిఎల్‌.నరసింహరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పివిఎల్‌.నరసింహరాజు మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటికే ట్రస్ట్‌ ద్వారా శ్మశానవాటిక ఇతర అభివృద్ధి పనులను రూ.30 లక్షలతో చేపట్టారన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధితో పాటు కొంతమంది మంచి మనసున్న దాతలు తమ సొంత గ్రామాభివృద్ధికి తోడ్పడితే ప్రజలకు సౌకర్యాలు ఏర్పడతాయన్నారు. వెంకటేశ్వర స్వామి వారికి, రామాలయంలో పూజలు నిర్వహించే అర్చకులు, భక్తులకు ఈ రేవుల నుంచి నీటిని నిత్యం తీసుకెళ్తుంటారు. ఈ రేవులు ఎంతో ఉపయోగంగా ఉన్నాయన్నారు. దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. పివిఎల్‌.నరసింహారాజు చేతులమీదుగా ట్రస్ట్‌ ఛైర్మన్‌ దాట్ల వెంకటరామరాజును సత్కరించారు. కాళ్లకూరు గ్రామంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో రూ.20 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణాలకు పివిఎల్‌.నరసింహరాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, గ్రామ సర్పంచి సాధు శ్రీదేవి, సొసైటీ బ్యాంక్‌ అధ్యక్షులు మాధు సురేష్‌, కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్‌ దండు వెంకటకృష్ణంరాజు, మాజీ ఎంపిపి వేగేశ్న వెంకట గోపాలకృష్ణరాజు, వైసిపి గ్రామ అధ్యక్షులు బొర్రా వెంకట సత్యనారాయణ, వేగేశ్న విజయరామరాజు, వీరమల్లు రామారావు, కట్టా సతీష్‌, చిటికెన సూర్యనారాయణ, కట్టా బాబ్జి, కోలా ఆంజనేయులు, చిటికెన లక్ష్మణరావు, కట్టా పెద్దిరాజు, గణపతి పాల్గొన్నారు.