దారిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: తవనపల్లి మండలం మల్లంగుంట పంచాయతీ కష్ణాపురం యానాదులకు ఇళ్లకు దారి లేకుండా ఆక్రమించిన అగ్రకులస్తులపై చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, యానాదుల సంఘం మహిళా అధ్యక్షురాలు సావిత్రమ్మలు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా 40 కుటుంబాలు కష్ణాపురంలో యానాదులు కాపురం ఉంటున్నా దారి లేకపోవడం దారుణమన్నారు. దారి సమస్య పరిష్కారం చేయాలని అనేకసార్లు అధికారులు చుట్టూ చెప్పలేరుగాల తిరిగినా సమస్య పరిష్కారం చేయకుండా మీన వేషాలు వేస్తున్నారని విమర్శించారు. ఆదారిని ఆక్రమించుకోవడానికి అగ్రకులస్తులు నిరంతరం ప్రయత్నం చేస్తూ యానాదులపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. అంతేకాకుండా ఒంటరి మహిళను కూడా చూడకుండా నాగమ్మపై నిరంతరం దాడి చేస్తున్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే పోరాటం ఉధతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్‌కి వినతిపత్రం అందజేశారు. డిఆర్‌ఓ స్పందిస్తూ సమస్య పరిష్కారం చేయాలని డిపిఓకి ఆదేశాలిచ్చారు. వారి పోరాటానికి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సురేంద్రనాద్ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మోహన్, శ్రీనివాసులు,మరియు యానాది కుటుంబాలు పాల్గొన్నారు.










