Mar 02,2022 20:53

విలేకరులతో మాట్లాడుతున్న డిఎస్‌పి.


ప్రజాశక్తి-తిరుపతి సిటి
స్థానిక తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో బుదవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేది అర్ధరాత్రి నాయుడుపేట-పూతలపట్టు ప్రధాన రహదారి (150 బైపాస్‌రోడ్డు)లోని వేదాంతపురం వద్ద లారీని అపి, డ్రైవరును బెదిరించి గుర్తు తెలియని వ్యక్తులు దోపిడికి పాల్పడిన సంఘటన విధితమే. స్పందించిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ సంఘటనకు పాల్పడిన ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వేదాంతపురానికి చెందిన పూతలపట్టు గోపి, షాషా వలి, పూల వాసు దోపిడికి పాల్పడినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ మేరకు తిరుచానూరు సమీపంలోని తనపల్లి రోడ్డు వద్దనున్న మామిడికాయల మండీ వద్ద బుదవారం వీరిని అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి సెల్‌ఫోన్‌ స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి, రిమాడుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.