Jun 14,2023 22:52

వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డా||రాజీవ్‌రెడ్డి

     అనంతపురం:డాక్టర్‌ రాజీవ్‌ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నాడు అనంతపురం నగరంలోని ఆర్‌ కె.నగర్‌, ఇందిరానగర్‌ కాలనీల్లో ఉచిత ఆరోగ్య వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. రోజువారీ ఆహార అలవాట్లు, ఒత్తిడి కారణంగా ఎక్కువ మంది ప్రజలు బిపి, షుగర్‌ వంటి వాటికి గురవుతున్నారు. ఇలాంటి వారికి చికిత్సలు నిర్వహించి పలు ఆరోగ్య జాగ్రత్తలను సూచించారు. బిపి, షుగర్‌ లాంటి వాటిని ముందుగా గుర్తించి మెరుగైన వైద్యం పొందాలని డా||రాజీవ్‌రెడ్డి తెలిపారు. అనంతపురం నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 140 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.