Mar 17,2023 21:00

ప్రజాశక్తి - పెనుగొండ
వడలి గ్రామంలో దాళ్వా సాగులో తీసుకోవాల్సిన మెలకువల గురించి జిల్లా వ్యవసాయ అధికారి జెడ్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్‌బిఐ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తారన్నారు. సీజన్లో వచ్చే మార్పులు దాళ్వా పంటపై రైతులకు అవగాహన సదస్సు కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి బాల నాగేశ్వరమ్మ, మండల వ్యవసాయ అధికారి స్పందన, ఇరగవరం వ్యవసాయ అధికారి రాఘవేంద్రరావు పాల్గొన్నారు.