అవార్డు అందుకున్న డాక్టర్ వేదమూర్తి
.అపోలో వైద్యులు
డాక్టర్ వేదమూర్తి రెడ్డికి అరుదైన గుర్తింపు
ప్రజాశక్తి-నెల్లూరు:స్థానిక అపోలో స్పెషాలిటీ ఆస్పత్రి యూరాలజిస్ట్ డాక్టర్ పి. వేదమూర్తి రెడ్డి ప్రతిష్ఠాత్మక రికార్డులను సొంతం చేసుకున్నారు. శనివారం నెల్లూరు నగరంలోని అపోలో వైద్యశాలలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అపోలో వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీ రాం సతీష్ మాట్లాడుతూ తమ వైద్యశాలలో యూరాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ పి.వేదమూర్తిరెడ్డి ఇటీవల ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం పొందారన్నారు. తమ వైద్యశాలలో 2021వ సంవత్సరంలో 46 ఏళ్ల రోగి శరీరంలోని కుడి పక్కన అడ్రినల్ గ్రంథిలో 13 సెంటీమీటర్ల మైలోలైపోమా అనే పెద్ద కణతిని ఎలాంటి కోత లేకుండా లాపరోస్కోపీ ద్వారా విజయవంతంగా డాక్టర్ వేదమూర్తి రెడ్డి తొలగించారన్నారు. 13 సెంటీమీటర్ల కణతిని సౌత్ ఇండియాలోఇప్పటి వరకూ లాపరోస్కోపీ ద్వారా ఎవరూ తొలగించలేదని, ఈ విషయాన్ని డాక్టర్ వేదమూర్తి రెడ్డి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి తెలియజేయగా వారు పరిశీలించి ఈ విషయాన్ని ఈ ఏడాది ఆగస్టు 24న నిర్ధారణ చేశారన్నారు. గతవారం డాక్టర్ వేదమూర్తి రెడ్డికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ధవపత్రంతో పాటూ అవార్డును అందజేశారు.
ఇదే సర్జరీ విషయంలో ఇండియా బుక్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ధవపత్రం అందజేసి, అవార్డును అందజేశారు. చివరగా యూరాలజిస్టు డాక్టర్ వేదమూర్తి రెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన రికార్డులను తాను సొంతం చేసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన గుర్తింపు పొందిన తనకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. చివరగా అపోలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది వేదమూర్తి రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.










