Apr 24,2023 20:57

ప్రజాశక్తి - పాలకోడేరు
మండుటెండలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో దోహదపడతాయని గొరగనమూడి గ్రామ సర్పంచి గొట్టుముక్కల వెంకట శివరామరాజు (శివాజీరాజు) అన్నారు. స్థానిక బస్టాండ్‌ వద్ద గొరగనమూడి గ్రామ పంచాయతీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సోమవారం సర్పంచి శివాజీ రాజు ప్రారంభించి గ్రామస్తులకు, స్థానికులకు, సచివాలయ అధికారులకు, ప్రయాణికులకు మజ్జిగ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచి శివాజీరాజు మాట్లాడుతూ ప్రస్తుతం ో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి ఎ. పోలయ్య మాట్లాడుతూ పంచాయతీ, గ్రామస్తుల సహకారంతో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చలివేంద్రం నిర్వహణకు దాతలు మరింత సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచి జి.రామాంజనేయులు, మాజీ ఉప సర్పంచి దొంగ సురేష్‌, వైసిపి నేతలు బొక్కా ప్రసాద్‌, పి.రామకృష్ణ, విఆర్‌ఒ శ్రీనివాస్‌, ఎఎన్‌ఎం వేదకుమారి, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ గోపాలకృష్ణ, మహంకాలరావు పాల్గొన్నారు.