- జాతీయ రహదారిపై బంధువుల ఆందోళన
ప్రజాశక్తి-రామకుప్పం(చిత్తూరు): మండల పరిధిలోని చెల్దిగానిపల్లి వద్ద గల పాల డైరీలో విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. డైరీలో కార్మికుడిగా పనిచేస్తున్న వీకోట మండలం కొంగాటం పంచాయతీ శివుని కుప్పం గ్రామానికి చెందిన సలీం అనె (24 )సంవత్సరాల యువకుడు సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో విద్యుత్ షాక్ తో మృతి చెందాడు .ఈ సంఘటనపై సలీం బంధువులు మరియు శివుని కుప్పం గ్రామస్తులు చెళ్ఢీగానిపల్లి వద్ద పలమనేరు - కుప్పం జాతీయ రహదారిపై బైఠాయించి సలీం కుటుంబానికి న్యాయం చేసి అతని మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా చల్గానిపల్లి జాతీయ రహదారిపై రోడ్డు కట్టంగ నినాదాలు చేస్తూ బైఠాయించారు. సంఘటన స్థలానికి రామకుప్పం ఎమ్మార్వో సురేశ్, ఎస్సై ఉమా మహేశ్స్వరరెడ్డి చేరుకుని వారితో మాట్లాడి కేసు నమోదు చేసి సలీం మృత దేహాన్ని పంచనామా నిమిత్తం తరలించారు.










