Apr 02,2023 15:21

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల పరిధిలో పి.కొత్తపల్లి గ్రామసమీపంలో రైతుతోటలో బోరు వేయడానికి వెళుతూ బోరుబండి వెనుక వైపున విద్యుత్ తీగెలు తగిలి బోరు లారీ దగ్ధమైంది. బోరు లారీకి డ్రైవర్ పెన్నప్ప (48) మృతి చెందారు. బెళుగుప్ప మండలం ఏర్రగుడి గ్రామానికి చెందిన ఇతనికి భార్య కుమారుడు ఉన్నాడని మరియు అజి వాలికి తీవ్ర గాయాలు కావడంతో 108 సాయంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి ఎస్ఐ రంగడు యాదవ్ కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్ట్మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వo ఆస్పత్రికి తరలించారు.