ప్రజాశక్తి - పెనుమంట్ర : పబ్లిక్ బియ్యాన్ని అమ్మిన కొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఎస్ఆర్ఐ వి పోతురాజు అన్నారు. గురువారం తెల్లవారుజామున బ్రాహ్మణ చెరువు వై సెంటర్ లో అక్రమంగా తరలిస్తున్న పబ్లిక్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు బియ్యం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోతురాజు మాట్లాడుతూ వీరవాసరం మండలం చెందిన తోకలపూడి చెందిన కత్తుల సత్యబాబు కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చప్పళ్ళ గ్రామానికి చెందిన ఉన్నమట్ల మణికంఠ 50 కేజీల బరువు కలిగిన 50 బస్తాలు పబ్లిక్ బియ్యం కొనుగోలు చేశాడు. వీటి విలువ రూ 45 వేలు ఉంటుందన్నారు. ఈ బియ్యాన్ని పెనుమంట్ర ఎంఎల్ఎస్ పాయింట్ కు తరలించినట్లు చెప్పారు. అదేవిధంగా రవాణా చేసిన వ్యాను రూ 4 లక్షల 50 ను, సహకరించిన దుర్గాప్రసాద్ అనే డ్రైవర్ ను అదుపులకు తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు విజిలెన్స్ సిఐ శివరామకృష్ణ , కానిస్టేబుల్ కె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.










