Jun 12,2023 16:57
  • మండల ఉద్యానాధికారి ఫజల్ ఉన్నిసా 

ప్రజాశక్తి-నార్పల : నార్పల మండలంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు ఉద్యాన పంటలు నష్టపోయిన క్రాప్ బుకింగ్ చేసుకున్న నార్పల మండల రైతులకు ప్రభుత్వం నుండి రైతులకు ఒక కోటి 71 లక్షల 72, వేలు రూపాయలు పంట నష్టపరిహారం మంజూరు అయినట్లు మండల ఉద్యానాధికారి ఫజులున్నిసా తెలిపారు. నార్పల మండలంలో 668.43 హెక్టార్లలో అరటిపంట నష్టపోయిన 831 మంది రైతులకు ఒక కోటి 67 లక్షల 10 వేల 750 రూపాయలు మంజూరు అయ్యాయని మండల ఉద్యానాధికారి ఫజల్ ఉన్నిసా తెలిపారు. 4.49 హెక్టార్లలో పంట నష్టపోయిన నలుగురు పప్పాయి రైతులకు 67 వేల 350 రూపాయలు, 14.95 హెక్టార్లలో టమోటా సాగుచేసిన 17 మంది రైతులకు 22 లక్షల 4 వేల 250 రూపాయలు, 0.4 ఎకరాల్లో కలింగర పంట నష్టపోయిన ఒక రైతుకు 6000 0.58 హెక్టార్లలో లిల్లీ పూలు సాగు చేసిన ఇద్దరు రైతులకు 8 వేల 700 రూపాయలు, 1.42 హెక్టార్లలో చామంతి పూలు సాగు చేసిన ముగ్గురు రైతులకు 21 వేల 300 రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. అదేవిధంగా నార్పల మండలంలో వివిధ పంటలు నష్టపోయి క్రాప్ బుకింగ్ చేసుకున్న ప్రతి రైతుకు నష్టపరిహారం మంజూరు అయిందని నార్పల మండల వ్యాప్తంగా 699.18 హెక్టార్లలో 872 మంది రైతులు వివిధ పంటలు నష్టపోయారని వారికి ప్రభుత్వం నుండి ఒక కోటి 71 లక్షల 72 వేల రూపాయలు మంజూరయ్యాయని  రైతుల ఖాతాల్లో నష్టపరిహారం  పడుతూ ఉందని మండల ఉద్యాన అధికారి ఫజులున్నిసా తెలిపారు.