May 10,2023 15:01
  • టీడీపీ, సిపిఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో మహిళలు, ప్రజలు రాస్తారోకో

ప్రజాశక్తి-పెనుకొండ : నగరపంచాయితీ పరిధిలోని తిమ్మాపురం, ఇస్లాపురం, వెంకటరెడ్డి పల్లి గ్రామాలకు నీళ్లు రాకపోవడంతో బుధవారం ఇస్లాపురం క్లాస్ వద్ద టీడీపీ, సిపిఎం ఆధ్వర్యంలో గంటపాటు ఖాళీ బిందెలు తీసుకొని మహిళలు, ప్రజలు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మూడు గ్రామాలలో నీళ్లు అరకోరగా వస్తున్నాయని, ప్రతిరోజు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నామని అనేక సార్లు అధికారులు దృష్టికి తీసుకుపోయిన ఫలితం లేకపోవడంతో రాస్తారోకో  నిర్వహించామని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై రమేష్ బాబు  ఆందోళనను విరామరించాలని  ప్రజలకు చెప్పడంతో మాకు నీళ్లు సమస్య పరిష్కారం చేసేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని ఎస్ ఐకి ప్రజలు తెలపడంతో అక్కడకి నగర పంచాయతీ కమిషనర్ వంశీ కృష్ణ భార్గవ చేరుకొని రేపటిలోగా నీటి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడంతో రాస్తరోకో విరమింపచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం  మండల కార్యదర్శి రమేష్, నియోజకవర్గ మైనార్టీ నాయకులు రియాజ్ భాషా 1,3 వార్డు కౌన్సిలర్ లు గీతా హనుమంతు, గిరి, సిఐటియు నాయకులు మహబూబ్ బాషా, వజ్రం నాగప్ప, హమాలీ భాష, హనుమంతు, సత్యం, శ్రీరాములు, హరి, నాగరాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.