Feb 27,2023 16:01
  • వెంటనే లబ్ధిదారులకు అందజేయాలి

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం: టిడ్కో ఇళ్లును వెంటనే ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వాలని, జగనన్న కాలనీలలో ఇళ్లును ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని టిడ్కో ఇల్లు పరిసర ప్రాంతాల్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రి, అంగన్వాడి సెంటర్ ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి, కర్రీ నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, పట్టణ కమిటీ సభ్యులు గొన్నా బత్తుల నాగేశ్వరరావులు  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తాడేపల్లిగూడెం సీపీఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ కి మెమోరాండం అందజేశారు. ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తామని మాట ఇచ్చారు .టిడ్కో ఇళ్లు బ్యాంకు అప్పుతో సంబంధం లేకుండా ఉచితంగా ఇస్తామని హమీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్న రాష్ట్రంలోని మూడు లక్షలటిడ్కో ఇళ్లు కట్టి ఖాళీగా ఉన్నా పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసొప్పడం లేదనీ వారు అన్నారు. 50 వేల నుండిలక్ష రూపాయల వరకు నాలుగేళ్ల క్రితమే పేదలుఅప్పులు చేసి మరీ డిపాజిట్లు కట్టారని వారు అన్నారు. లబ్ధిదారులు పేరుతో ప్రభుత్వం బ్యాంకుల నుండి తెచ్చిన అప్పుపై వడ్డీ పడుతుందని వారు వాపోయారు. కరోనా లో పనులు లేక ఆదాయాలు రాక అద్దెలు కట్టులేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గత ప్రభుత్వంలో తప్పులు జరిగితే ఈ ప్రభుత్వం విచారించి శిక్షించాలి. అంతేగాని ప్రజలను బలిచేయడం అన్యాయమని వారు అన్నారు.సెంటు స్థలం లో ఇల్లు కట్టుకుంటే దశలవారీగా లక్షా ఎనభై వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని వారు అన్నారు. ఇనుము, సిమెంటు, ఇసుక ధరలు ఆకాశాన్ని అంటారని వారు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇల్లు మీరు కట్టుకోలేకపోతే ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని  చెప్పారు కానీ ఇప్పుడుమాట మార్చి మీరే కట్టుకోవాలని ప్రజల మీద భారం వేస్తున్నారని వారు అన్నారు. అప్పు ఇప్పిస్తాం, మీరు అప్పు చెయ్యండి  అంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇల్లు కట్టుకోకపోతే స్థలాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు అని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి బ్యాంకులు డబ్బు మంజూరుచేయడం లేదని, కట్టిన డిపాజిట్లే కాకుండా మూడు లక్షల రూపాయలు పైన  ఇంకా డబ్బు కడితే ఇళ్లువెంటనే ఇస్తామని చెబుతూ ,బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకొని పేదలపై మరింత భారం మోపడానికి ప్రయత్నం చేస్తుందని ~అన్నారు. ఇల్లు ప్రారంభించిన వారికి బిల్లులు సకాలంలో మంజూరు కావడం లేదని,ప్రభుత్వం రోడ్లు, లైట్లు,మంచినీరు సౌకర్యాలన్నీ కల్పిస్తామని చెప్పినా ఆ పనులు అరకొరగానే జరుగుతున్నాయని వారు అన్నరు.ఇంటి నిర్మాణానికి కనీసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని టిడ్కో ఇళ్లను బ్యాంకు అప్పుతో సంబంధంలేకుండా వెంటనే లబ్ధిదారులకు ఇచ్చి రిజిస్ట్రేషన్లుచేయాలని, ప్రభుత్వం కట్టి ఖాళీగా ఉన్న ఇళ్లు ఇవ్వకపోతే లబ్ధిదారులు కు ఇళ్లును స్వాధీనం చేస్తామని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొన్నాబత్తుల నాగేశ్వరరావు,చిటికిన రాము,కరెడ్ల రామకృష్ణ,జవ్వాది శ్రీను, శిద్దిరెడ్డి శేషుబాబు, గొర్రెల సతీష్, నరమాల కృష్ణ, మేట్రేటి రమణ,నర్మాల నారాయణరావు, కుంచంగి నానాజీ, ఏపూరిశ్రీను, కె.కొండలరావు పోతు శ్రీను, అయినాల ధర్మారావు ,  మరియు సిపియం పార్టీ సభ్యులు,టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులు పాల్గోన్నారు.