Feb 27,2023 15:55

ప్రజాశక్తి-పాలకొల్లు : టిడ్కో గృహాలు పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని సిపిఎం కార్యదర్శి జవ్వాది శ్రీనివాసరావు డిమాండ్ చేసారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ టిడ్కో ఇళ్ళ కు డిపాజిట్లు చెల్లించి వడ్డీలు కడుతూ లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఏళ్ళ తరబడి ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వం టిడ్కో ఇళ్ళను పట్టించు కోవడంలేదన్నారు. జగనన్న కాలనీల్లో సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం 34 లక్షల ఇళ్లకు అనుమతి ఇచ్చిన, కట్టుకునేందుకు సబ్సిడీ అమౌంట్ 6 లక్షలకు పెంచాలన్నారు. ఇనుము, సిమెంట్ ధరలు తగ్గించాలని కోరారు. టిడ్కో గృహాలకు రవాణా, ఆసుపత్రి, మార్కెట్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వలవల శ్రీరామ మూర్తి, అజయ్ కుమార్, చల్లా సోమేశ్వరరావు, టి.శ్రీనివాసరావు, గుబ్బల సత్యనారాయణ, టి.గంగరాజు, గణేష్, పి.కృష్ణ, గురవయ్య, గుబ్బల త్రిమూర్తులు పాల్గొన్నారు.