Mar 01,2023 15:42

ప్రజాశక్తి-తణుకు రూరల్ : ప్రజలు వాడే గ్యాస్ పై పెంచిన రూ.50రూపాయలు మోడీ ప్రభుత్వం ఉపసంహారించుకోవాలని సిపిఎం  జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీవీ.ప్రతాప్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక అమర వీరుల భవనం వద్ద  గ్యాస్ బండలుతో కేంద్రం పెంచిన గ్యాస్ ధరను  వెంటనే ఉపసంహారించుకోవాలని సిపిఎం  ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని, నశించాలి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, ఆపాలి ప్రజలపై భారాలు, సిగ్గు సిగ్గు మన కేజీ బేసిన్ గ్యాస్ మనం కొనుక్కోవడం అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ప్రతాప్ మాట్లాడుతూ... బీజేపీ గడిచిన ఈ 9 ఏళ్ళ కాలంలో ప్రజలు పై  గ్యాస్ భారం వందలు సార్లు వేసిందని అన్నారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికే ప్రతి వస్తువులు మీద జి ఎస్ టి  పెట్రోల్, డిజిల్, కరెంట్, రైల్వే చార్జీలు వంటి భారాలుతో సతమతం అవుతుంటే "మూలిగే నక్కపై తాటికాయ పడ్డ" చందంగా  ఉన్నదని  అన్నారు. మోడీ పాలనలో ప్రజలు ఉపాధి అవకాశాలు, కొనుగోలు శక్తి లేక ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నారని విమర్శించారు. కార్పొరేట్లకు పన్నులు తగ్గించి, లోన్లు మాఫీ చేసి ప్రజలపై  భారాలు వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు లేదని అన్నారు. మన  కేజీ బేసిన్ లో ఉన్న గ్యాస్ ని ఇక్కడ నుండి గుజరాత్ తరలించి మళ్ళీ మనకే ఒక్క బండ వేలలలో  అమ్ముతుంటే రాష్ట్ర ప్రభుత్వం చూసి చూసి చూడనట్టు వ్యవహరించడం  సిగ్గు చేటన్నారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న  ప్రజా వ్యతిరేక విధానాలపై  వచ్చే ఎన్నికలలో ఇదే గ్యాస్ పై ప్రజలు ఉడికిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో సిపిఎం  నాయకులు గార రంగారావు, రేవు రాజేష్ వర్మ, బి.శ్రీనివాసరావు, కెఎస్ఎస్  మణికంఠ, టీ.ధనలక్ష్మి, ఆర్ ఎస్  యామిని, మానస,నాగమణి, విజయలక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు