Apr 16,2023 15:06
  • సిపిఐ-సిపిఎం ప్రచారభేరి సిపిఎం  రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు పిలుపు 

ప్రజాశక్తి-పలమనేరు : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా సిపిఎం-సిపిఐ ఆధ్వర్యంలో  జరుగుతున్న ప్రచారభేరి కార్యక్రమాన్ని ఆదివారం పలమనేరులో సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, మాట్లాడుతూ మోడీని గద్ద దించండి దేశాన్ని రక్షించండి ప్రచార కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం గత 9 సంవత్సరాల నుండి ఒక పథకం ప్రకారం మత విద్వేషాలు రెచ్చగొట్టడం మన భారత రాజ్యాంగాన్ని లౌకిక తత్వాన్ని  విధ్వంసం చేయడం, కార్పొరేటర్ల దేశంగా మార్చడం, మోడీ చేస్తున్న దుర్మార్గాలను ప్రశ్నించే వారిని నిర్బంధాలు, కేసులు నమోదు చేయడం నిర్బంధించడం చేస్తున్నారు. దేశ సంపదను ఆదానికి అమ్మేయడం, దేశాన్ని అప్పుల్లో ముంచారు. ధనిక దేశం పేద ప్రజలుగా మార్చారు. కోట్లాదిమంది ప్రజలు పెరుగుతున్న ధరలు భరించలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళుతున్నారు. మోడీ అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం ప్రజా పోరాటాలు చేస్తున్న సీపీఐ, సిపిఎం చేసే ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ఇంటింటి తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ప్రజల నుండి విశేష స్పందన వస్తున్నది. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిరంజీవమ్మ ,ఓబుల్ రాజు కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నూరి ఈశ్వర్ సీపీఐ డివిజన్ కార్యదర్శి సుబ్రమణ్యం, సీపీఐ పట్టణ కార్యదర్శి గిరిధర్ గుప్తా, సి పి ఐ పట్టణ కార్యదర్శి మంజునాథ్, ఐద్వా పట్టణ కన్వీనర్ జయంతి, సీపీఎం నాయకులు రాజా,ఆంజి, సంజయ్, లక్ష్మయ్య  తదితరులు పాల్గొన్నారు