- సిపిఐ-సిపిఎం ప్రచారభేరి డిమాండ్
ప్రజాశక్తి-చిత్తూరు : సిపిఎం-సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచారభేరి మూడవ రోజు చిత్తూరు లెనిన్ నగర్ లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు లు మాట్లాడుతూ మోడీని గద్ద దించండి దేశాన్ని రక్షించండి ప్రచారభేరి కార్యక్రమాన్ని లెనిన్ నగర్ ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా లెనిన్ నగర్ లో ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డంపింగ్ యార్డును మార్చాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం గత 9 సంవత్సరాల నుండి ఒక పథకం ప్రకారం మత విద్వేషాలు రెచ్చగొట్టడం మన భారత రాజ్యాంగాన్ని లౌకిక తత్వాన్ని విధ్వంసం చేయడం, కార్పొరేటర్ల దేశంగా మార్చడం, మోడీ చేస్తున్న దుర్మార్గాలను ప్రశ్నించే వారిని నిర్బంధాలు, కేసులు నమోదు చేయడం నిర్బంధించడం చేస్తున్నారు. దేశ సంపదను ఆదానికి అమ్మేయడం, దేశాన్ని అప్పుల్లో ముంచారు. ధనిక దేశం పేద ప్రజలుగా మార్చారు. కోట్లాదిమంది ప్రజలు పెరుగుతున్న ధరలు భరించలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళుతున్నారు. మోడీ అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం ప్రజా పోరాటాలు చేస్తున్న సీపీఐ, సిపిఎం చేసే ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ఇంటింటి తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ప్రజల నుండి విశేష స్పందన వస్తున్నది. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వాటికోసం మీరు చేస్తున్న కార్యక్రమం అభినందనీయమని ప్రజల నుండి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సురేంద్రన్, చైతన్య, ప్రసాద్, జ్యోతిరావు సిపిఐ నాయకులు గోపీ, చంద్ర, ,విజయకుమారి, విజయగౌరి, మణి, బాలాజి తదితరులు పాల్గొన్నారు.










