ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : బిజెపి ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపిని సాగనంపుదాం దేశాన్ని కాపాడుకుందామనే నినాదంతో తాడేపల్లిగూడెం పట్టణంలో నాలుగో రోజు సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ప్రసార భేరి యాత్ర కార్యక్రమం హౌసింగ్ బోర్డు, గణేష్ నగర్, మిలిటరీ కోలనీ,గాయత్రీదేవి సెంటర్,రామారావు పేట, కేఎస్ఎన్ కోలనీ వార్డులలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారభేరి యాత్ర నిర్వహించారు.ఈ కార్యక్రమంను ఉద్దేశించి సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు,సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, సిపిఎం పట్టణ నాయకులు కరెడ్ల రామకృష్ణ లు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వారు అన్నారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం, ప్రతిపక్షాలైన టిడిపి, జనసేన ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మోడీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించి పోరాటంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.ప్రజలకు అచ్చేదిన్ తీసుకువస్తానని ప్రచారం చేసి గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం ప్రజలకు చచ్చేదిన్ తీసుకొచ్చిందని వారు విమర్శించారు. ధరలు, నిరుద్యోగం తగ్గిస్తామని చెప్పి వాటిని పెంచుకుంటూ పోతుందని వారు విమర్శించారు. రైతులు గిట్టుబాటు ధర కోసమే కాకుండా పంట అమ్ముకోవడానికి పోరాటం చేయాల్సిన దుస్థితి బిజెపి ప్రభుత్వం హయంలో ఏర్పడిందని వారు అన్నారు. దేశాన్ని మోడీకి పాలించే అర్హత లేదని వారు విమర్శించారు. ప్రచారభేరిలో తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలంతా పాల్గొని బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని,ఈదేశం నుండి బిజెపి నా తరిమికొట్టాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంనకు కరెడ్ల రామకృష్ణ, జవ్వాది శ్రీను,జవ్వాది శివ, శిద్దిరెడ్డి శేషుబాబు,చిట్టేటి సత్యనారాయణ, పోతు శ్రీను, అల్లం రాము, దాస్యం రాము, రావూరి బాబీ,ఉయ్యూరి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.










