Apr 13,2023 11:36

ప్రజాశక్తి-పుట్లూరు : మండల కేంద్రంలో బస్టాండ్ సర్కిల్ నందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార బేరి గోడ పోస్టర్లు గురువారం విడుదల చేశారు. అనంతరం మండల కార్యదర్శి డి.పెద్దయ్య మాట్లాడుతూ! రాష్ట్ర పార్టీల సిపిఐ ,సిపిఎం పిలుపుమేరకు మోడీని గద్దె దింపండి దేశాన్ని కాపాడండి అనే నినాదంతో కేంద్ర BJP ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలపై ఏప్రిల్ 14 నుంచి 30 వరకు "ప్రచార బేరి" బిజెపి మతోన్మాద, కార్పొరేట్ అనుకూల, ప్రైవేటీకరణ విధానాలను తిప్పి కొడదాం, రాజ్యాంగ, ప్రజాసామిక హక్కులను కాపాడుదాం, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం నిర్మాణంపై ద్రోహాన్ని నిరసిందాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ మండల కార్యదర్శి ఏ.రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు సి.పెద్దిరాజు, చేతి వృత్తిదారుల మండల అధ్యక్షులు సి. ఓబుళపతి  దేవరాజు, విజయ్ సాలెంల రామాంజనేయులు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.