Apr 24,2023 15:18
  • సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు వాడ గంగరాజు, నాగరాజు లు పిలుపు

ప్రజాశక్తి - గంగాధర నెల్లూరు : ప్రధానమంత్రి నరేంద్రమోదీని గద్దె దించి దేశాన్ని రక్షించుకుందామని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు,  సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు కోరారు. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచారభేరి సోమవారం గంగాధర నెల్లూరు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో  సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజులు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వాం గత 9 సంవత్సరాల నుండి ఒక పథకం ప్రకారం మత విద్వేషాలు రెచ్చగొట్టడం మన భారత రాజ్యాంగాన్ని లౌకికతత్వాన్ని విధ్వంసం చేయడం జరుగుతుందన్నారు. కార్పొరేటర్ల దేశంగా మార్చడం, మోడీ చేస్తున్న దుర్మార్గాలను ప్రశ్నించే వారిని నిర్బంధాలు, కేసులు నమోదు చేయడం నిర్బంధించడం చేస్తున్నారని చెప్పారు. భారతదేశ సంపదను కార్పొరేటర్ ఆదానికి అమ్మేయడం, దేశాన్ని అప్పుల్లోకి నెట్టేశారని తెలిపారు.  ధనిక దేశంలో ప్రజలను పేదవారిగా మార్చిన ఘనత బిజేపీకే దక్కిందన్నారు. కోట్లాదిమంది ప్రజలు పెరుగుతున్న ధరలు భరించలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళుతున్నారని చెప్పారు. మోడీ అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం ప్రజా పోరాటాలు చేస్తున్న సీపీఐ, సిపిఎం చేసే, ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇంటింటి తిరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వాటికోసం మీరు చేస్తున్న కార్యక్రమం అభినందనీయమని ప్రజల నుండి స్పందన వచ్చిందన్నారు.  ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులుమార్కొండయ్య,
రఘు, జయరాం, సిపిఎం నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.