ప్రజాశక్తి-ఆత్మకూరు : బిజెపి మతోన్మాద కార్పోరేట్ అనుకూల ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ ఈనెల 14 నుండి 30వ తేదీ వరకు దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా గురువారం ఆత్మకూరు మండలం కేంద్రంలో ప్రచార బేరి గోడపత్రికలను సిపిఎం మండల కార్యదర్శి శివశంకర్ .ఈసందర్భంగా మాట్లాడుతూ సామాన్య ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి నిత్యవసర వస్తువులు ధరలు అదుపు చేయడంలో మోడీ సర్కార్ గోరంగా వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు.గత 9 సంవత్సరాల నుండి ఒక పథకం ప్రకారం మత విద్వేషాలు రెచ్చగొట్టడం మన భారత రాజ్యాంగాన్ని లౌకిక తత్వాన్ని విధ్వంసం చేయడం, అంబానీ ఆదోని కార్పొరేటర్ల దేశంగా మార్చడం చేస్తున్నదన్నారు.మోడీ చేస్తున్న దుర్మార్గాలను ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం నిర్బంధిస్తుందన్నారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హౌదా, జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోగా ఉత్తరాంధ్ర జిల్లాలకు తల మానికంగా ఉన్న విశాఖస్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ పార్టీలు మోడీని ఒక్క మాట అనడానికి భయపడుతున్నారని అన్నారు. మోడీ నియంతత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈనెల 14 నుండి 30వ తేదీ వరకు దేశవ్యాప్త ప్రచారంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు రామయ్య వలి జయమ్మ వెంకటమ్మ సరస్వతమ్మ సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున రామకృష్ణ వెంకటనారాయణ కమిటీ సభ్యులుతదితరులు పాల్గొన్నారు.










