Apr 28,2023 16:05

ప్రజాశక్తి-పుట్లూరు : బిజెపిని సాగనపుదాం దేశాన్ని కాపాడుకుందాం కార్యక్రమం శుక్రవారం పుట్లూరు మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రచార బేరి కార్యక్రమం మండల కార్యదర్శి డి పెద్దయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం జిల్లా సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి నియోజకవర్గ బాధ్యులు పి.నారాయణస్వామి పాల్గొని మాట్లాడుతూ! దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రతి వ్యక్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిడదీయాల్సిన సమయం ఇది లేకుంటే మనందరి భవిష్యత్తు చీకటం అయిపోతుంది. అమీషాల నాయకత్వంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ స్కూటీమి అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండవలసిన ప్రజల మధ్య మత విద్వేషకు చిచ్చు రాజేస్తున్నది. మరోవైపు ఆదానీ, అంబానీ లాంటి అతి సంబన్నులకు దేశ సంపదను దోశ పెడుతున్నది. మనందరి ఉమ్మడి సంపదగా ఉన్న బ్యాంకుల్ని, మనం కట్టిన పన్నుతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, ఓడరేవుల్ని, ఆఖరికి మనకు అన్నం పెట్టే వ్యవసాయ రంగాన్ని సైతం కార్పొరేట్లకు తార దత్త0 చేస్తున్న మోడీ ప్రభుత్వం. మోడీ అండదండలతో ఆదరణ ఏవిధంగా ప్రపంచాన్ని మోసం చేసి లక్ష కోట్లు కొల్లగొట్టాడో హిండెన్ బర్గ్ నివేదిక బట్టబయలు చేయడం జరిగింది. అయినా దాని మీద విచారణకు అంగీకరించకుండా ఆదానిని ఈ కేంద్ర ప్రభుత్వం వెనుకేసుకొస్తున్నది. అలాగే సామాన్య ప్రజలకు అండగా ఉండటం పోయి వారి మీదే మోయలేనంత భారాలను మోపుతున్నది. మోడీ ప్రభుత్వం గ్యాస్ బండ  మనకు గుడిబండ అయిపోయింది. కరెంట్ బిల్లు ముట్టుకుంటేనే షాకులు కొడుతున్నాయి. పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు మన బతుకుల్లో మంటలు రాజేస్తున్నాయి. ధరలు కొండెక్కాయ్. నిరుద్యోగుల బతుకులు అఘాతంలోకి జారిపోతున్నాయి.