Mar 19,2023 16:26
  • సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం 
  • భీమవరంలో ఘనంగా ఇరువురి వర్ధంతి 

ప్రజాశక్తి -భీమవరం : సిపిఎం తొలితరం నాయకులు ఇ.ఎం.ఎస్‌ నంబుద్రిపాద్‌,తెలంగాణా సాయుద పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యంని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని  సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం అన్నారు.భీమవరం  మెంటేవారితోటలోని  సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద ప్రజానాట్యమండలి గీతాలాపనలతో ఇరువురి ప్రధమ  వర్ధంతి వేడుక ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం వారి  చిత్రపటాలకు  పూల మాలలు వేసి ఘనంగా  నివాళులు అర్పించి మట్లాడరు. ఇ.ఎం.ఎస్‌ నంబుద్రీపాద్‌ భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన పాత్ర పోశించారన్నారు.కమ్యూనిస్టు పార్టీ తొలి పోలిట్‌బ్యూరో సభ్యులు నవరత్నాల్లో ఒకరు దక్షిన బారత దేశంలో పుచ్చలపల్లి సుందరయ్య, కేరలలో కృష్ణపిళ్ళే,ఎకె. గోపాలన్‌ వంటి యోదాను యోధులతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించినటువంటి యోదుడు, కమ్యూనిస్టు సిద్ధాంత కర్త, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణ కర్తల్లో ఒకరని అన్నారు. 1957లో  భారత దేశంలో మొట్ట మొధటిసారిగా ప్రజాస్వామ్య యుతంగా ఓట్ల ద్వారా గెలుపొందిన తొలి ముఖ్యమంత్రి ఇం.ఎస్‌.నంబుద్రిపాద్‌ అన్నారు. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, తెలంగాణా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరు, ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో మహిళా ఉద్యమాన్ని మల్లు  స్వరాజ్యం నిర్మించారన్నారు. స్వరాజ్యం భూస్వామ్య కుటుంబంలో పుట్టి రజాకార్ల దుర్మార్గానికి, నిజాం పాలనకు వ్యతిరేకంగా దోపిడీకి గురౌతున్న వర్గపక్షాన నిలబడి వందలాది పల్లెలలు, శ్రామికులు, కూలీలు విముక్తి కోసం తుపాకి పట్టి పోరాడిన యోధురాలని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం  జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె.ఎన్‌.వి గోపాలన్‌, బి.వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, మామిడిశెట్టి రామాంజనేయులు, ఎం.వైకుంఠరావు, కార్యకర్తలు మల్లిపూడి ఆంజనేయులు, ఎస్‌.కె వలీ,బి.ఎన్‌.ఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.