May 24,2023 11:54

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల పరిధిలో వడ్డిపల్లి గ్రామంలో బుధవారం కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పనులు దగ్గర సర్వే చేయడం జరిగింది.  సిపిఎం మండల సెక్రెటరీ శివ శంకర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పనులు దగ్గర మాట్లాడుతూ ఉపాధి కూలీలకు 300 రోజులు పని దినాలుకల్పించాలని రోజు కూలి వేతనం 600 రూపాయలు ఇవ్వాలని గతంలో మాదిరిగా కూలీలకు గడ్డపారులు మెడికల్ కిట్టు సమరం అలవెన్స్  టెంటు మజ్జిగ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమానికి హెచ్ రామయ్య 'చిరంజీవి సత్యమయ్య; రామకృష్ణ, నరసింహారెడ్డి, లక్ష్మీదేవి, సరస్వతి, పెద్దక్క, తదితరులు పాల్గొన్నారు.