May 08,2023 16:36
  •  సీపీఐ డిమాండ్ 

ప్రజాశక్తి-నార్పల : నార్పల మండల కేంద్రము అయిన నార్పలలో ఇంటి గుత్త పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన నార్పల పంచాయితీ అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయము వద్ద  సీపీఐ అద్వర్యంలో జరిగిన ధర్నాకు ముఖ్య అథితులుగా హజరైన శింగనమల సీపీఐ నీయోజకవర్గ కార్యదర్శి,టి.నారాయణస్వామి, ఏపి రైతుసంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి డి.చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ, నార్ఫల మండల కేంద్రములోని సీపీఐ కాలనీలో దాదాపుగా 200 కుటుంబాలు పైగా జీవనము కోనసాగిస్తున్నారు. కాని వాటిలోని దాదాపుగా 110 కుటుంబాలు దగ్గర ఇంటి గుత్తలపేరుతో దాదాపు 7నెలలు క్రిందట పంచాయితీ అధికారులు సీపీఐ కాలనీలోకి వచ్చి, ఇంటి పన్ను పేరుతో ఓక్కోక కుటుంబముతో 800రూపాయలు రసీదు ఇవ్వకుండా వసూలు చేసి రెండురోజులలో గుత్త రశీదు ఇస్తామని చెప్పి,ఇంతవరకు ఇవ్వలేదు. పేదలు అనేకమార్లు పంచాయితీ అధికారులు చూట్టూ తిరిగిన పట్టించుకోలేదు కావున తక్షణమే సంవత్సరానికి ఏంత గుత్తమొత్తము అంత మొత్తాన్ని పట్టుకోని ఇంటి పన్ను రశీదులు ఇవ్వాలి, మిగతా నగదును పేదలకు అందచేయాలి అక్రమంగా వసూలు పాల్పడిన పంచాయితీ అధికారులపై తీసుకోవాలని స్ఫంధన అధికారుల దృష్టికీ తీసుకురావడము జరిగింది. వారుపేదలకు న్యాయము చేస్తాము, తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హమీ ఇవ్వడము జరిగింది. మరియి సీపీఐ కాలనీలో జగనన్న పట్టాలు పేరుతో దాదాపుగా 210 మంది పేదలకు పట్టాలు మంజూరు చేస్తామని చెప్పి కాని  వాటిలో కేవలము 120 మాత్రమే పోజిషన్ సర్టిఫికెట్ లు ఇచ్చారు. కాని దాదాపుగా 80 మందికి పైగా పట్టాలు మంజూరు చేయాలి వారికి ఇవ్వకుండా  రెవెన్యు అధికారులు కాలయాపన చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. వాటిని కూడా ఖండిస్తున్నాము, తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశిలించి న్యాయముచేయాలని డిమాండ్ చేస్తూ ,కాలనీలో కరెంటు, నీటితో పాటు మౌళిక సధుపాయాలు కల్పించాలని అధికారులను సీపిఐ డిమాండ్ చేస్తున్నాము. ఏపి రైతు సంఘము నీయోజకవర్గ కార్యదర్శి, రాము నార్పల రైతుసంఘము కార్యదర్శి S,మారుతీప్రసాద్, సీపీఐ సీనీయర్ నాయకులు, గంగాధర, చాపల రామాంజీ,  తిరుపతమ్మ, జోసెప్ , కే రమేష్  నాగార్జున, తదిటతరులు పాల్గోనడమైనది.