ప్రజాశక్తి-పుట్లూరు : మోడీ ప్రభుత్వాన్ని గంత దింపుదాం దేశాన్ని కాపాడుదాం అనే నినాదంతో మండలంలోని చింతకుంట, కందికాపుల గ్రామల్లో గ్రామ శాఖల కార్యదర్శులు D.పెద్దన్న,కుళ్ళయప్ప అధ్యక్షతన ప్రచార బెరి సంధర్బంగా కరపత్రాల పంఫిణికార్యక్రమానికి శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల సీపీఐ కార్యదర్శి D.పెద్దయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్ర లో బిజెపి అదికారములోకి వచ్చినప్పటినుండి ప్రజావ్యతిరేక నిరంకుశవిధానాలు అవలంబిస్తూ మనమందరం ఉమ్మడి సంపదగా ఉన్న బ్యాంకుల్ని మనం కట్టిన పన్నులతో నిర్మించిన ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, ఓడరేవుల్ని ఆఖరికి మన అందరికీ అన్నం పెట్టే వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్లకు దారా దత్తు వచేస్తుంది మోడీ ప్రభుత్వం. మోడీ అండదండలతో ఆదాని ఏవిధంగా ప్రపంచాన్ని మోసం చేసి లక్షల కోట్లు కొల్లగొట్టాడో హిండెన్ బర్గ్ నివేదిక బట్టబయలు చేసింది. అయినా దాని మీద విచారణ అంగీకరించకుండా ఆదానిని ఈ కేంద్ర ప్రభుత్వం వెనుకేసుకొస్తుంది. పైగా మరింత వేగంగా దేశంలోని అడవులను, భూములను, విద్యుత్ ప్రాజెక్టులను, గనులను కార్పొరేట్లకు అక్రమంగా కట్టబెడుతున్నది. పేదలకు, సామాన్య ప్రజలకి అండగా ఉండాల్సింది పోయి వారి మీదే మోయలేనంత భారాలను మోపుతున్నది మోడీ ప్రభుత్వం. గ్యాస్ బండ మనందరికీ గుడిబండ అయిపోయింది. కరెంట్ బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ,డీజిల్ ధరలు మన బతుకులు మంటలు రాజేస్తున్నాయి. ధరలు కొండెక్కాయి. నిరుద్యోగల బతుకులు ఆగాధంలోకి జారిపోతున్నాయి. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదు. పేదలకు విద్య, వైద్యం అందనంత ఖరీదైపోయి కార్పొరేట్ వ్యాపారంగా మారిపోయాయి. గ్రామీణ పేదలకు ప్రాణదారంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని సైతం నీరుగారుస్తుందని మండిపడ్డారు.










