Apr 21,2023 15:40
  • సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘాలు      

ప్రజాశక్తి-ఉరవకొండ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజల వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటే నరేంద్ర మోడీ హటావో దేశం కి బచావో అన్న నినాదంతో దేశ ప్రజలు ముందుకు సాగాలని ప్రజా సంఘాల నాయకులు  పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ)ఈ నెల 14 నుంచి 30 వరకు పల్లె పల్లెలో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్న వామపక్ష పార్టీల పిలుపుమేరకు శుక్రవారం ఉరవకొండ పట్టణం  లో జరిగిన ప్రచారంలో సిపిఐ, సిపిఎం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందని ముఖ్యంగా నిత్యవసర సరుకులు పెట్రోలు, డీజిల్ వంట గ్యాస్ వంటి సరుకులను విపరీతంగా పెంచే పేదల నడ్డి విరిచేస్తుందన్నారు. దేశ అభివృద్ధి కన్నా బడా భూస్వాములు పారిశ్రామికవేత్తలు అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ మధుసూదన్,జిల్లా కార్యవర్గ సభ్యులు రంగారెడ్డి, రైతు సంఘం నాయకులు సీనప్ప,సిపిఐ పార్టీ ఉరవకొండ నియోజకవర్గం కార్యదర్శి మల్లికార్జున, సహాయ కార్యదర్శి మనోహర్, ఉరవకొండ కార్యదర్శి తలారి మల్లికార్జున, వజ్రకరూరు కార్యదర్శి సుల్తాన్, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు,ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.