Sep 03,2022 14:37

ప్రజాశక్తి-చిత్తూరు: చిత్తూరు జిల్లాలో పలుచోట్ల ఇటివలకాలములో ట్రాన్స్ఫార్మర్ దొంగతనము అవుతున్నాయని చిత్తూరు జిల్లా SP Y. రిశాంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించినారు. ఈక్రమంలో శుక్రవారం  చిత్తూరు DSP N.సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ K. మద్దయ్యఅచ్చారికి రాబడిన సమాచారము మేరకు V.రామక్రిష్ణ, సబ్ ఇన్స్పెక్టర్, చిత్తూరు తాలూకా PS,  M.అనిల్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్, పెనుమూరు PS మరియు తన సిబ్బందితో  చిత్తూరు జిల్లా, పెనుమూరు మండలము, కలవకుంట పంచాయతీ, కలవకుంట NTR జలాశయం డ్యాంకు ఉత్తరంగా వున్న ముళ్ళచెట్ల పొదల వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమాస్పదముగా సంచరిస్తూ మోటార్ సైకిల్ పై గొనె సంచులను పెడుతూ పోలీసులను చూసి పారిపోవుటకు  ప్రయత్నించారు. దీంతో వారిని చుట్టుముట్టి పట్టుకొని వారిని విచారించగా దొంగతనం బయటపడింది. ముద్దాయిల వద్ద నుండి రూ10,00,000/-లు విలువ చేసే సుమారు 250 కేజీల రాగి వైరును మరియు నేరానికి ఉపయోగించిన ఒక TVS కంపెనీకి చెందిన Star city మోటారు సైకిలు నంబరు TN23-CR-4386ను స్వాదినము చేసుకున్నారు. సదరు ముద్దాయిలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ K.మద్దయ్య అచ్చారి, చిత్తూరు తాలూకా PS సబ్ ఇన్స్పెక్టర్ V.రామక్రిష్ణ, , పెనుమూరు PS సబ్ ఇన్స్పెక్టర్ M.అనిల్ కుమార్ మరియు సిబ్బందిని అభినందించారు.