ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో మహిళా సహకార పాల డైరీ రైల్ రన్ నిర్వహించడం జరిగింది అనంతరం ఆలమూరు జగనన్న లేఅవుట్ ప్రక్కన ఏర్పాటు చేసిన తోపుదుర్తి మహిళా సహకార పాల డెయిరీ ప్రారంభానికి అంతా రంగం సిద్ధమైంది. అధునాతన సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన సతీమణి మనోరమ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య పాల్గొని నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింది. సాంకేతిక నిపుణుల పర్యేక్షణలో ట్రయల్ రన్ జరిగింది. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా విజయవంతమైంది. ఈ పాల డెయిరీ ఏర్పాటుతో తొలి విడతలో రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా 10 వేల మంది మహిళా పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. ఏడాది కాలంలోనే మరో 20 వేలమందికి లబ్ధి కలగనుంది. అంటే మొత్తం 30 వేల మంది మహిళా రైతులకు మేలు జరగనుంది. అతి త్వరలోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ డెయిరీని ప్రారంభించనున్నారు. రోజు 1.20 లక్షల లీటర్ల పాలన రైతుల నుంచి సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సేకరించిన పాలను ప్రాసెసింగ్ చేసి ప్యాక్ చేసి అనంతపురం నగరంతో పాటు వివిధ పట్టణాలకు తరలించి విక్రయించనున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, స్టోర్ డీలర్లు, మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు










