Mar 27,2023 15:18

ప్రజాశక్తి-భీమవరం : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగివద్ద నుండి గంజాయి పట్టుబడడం మత్తుఆంధ్రప్రదేశ్ గా జగన్ పరిపాలన మారిందని టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ వ్యాఖ్యానించారు. దుమపానం మద్యపానం నిషేధమైన తిరుమల కొండపై గంజాయి ఇతర మత్తు పదార్థాల విక్రయిస్తున్నందున జగన్ అసమర్ధ పాలనకు నిదర్శనం అన్నారు. జగన్ సొంత బంధువులతో నిర్వహిస్తున్న టిటిడి పాలకమండలి ఆధ్వర్యంలో మత్తు,మద్యం బాబులకు నిలయంగా మారిందని జాతీయ నేరవిభాగాలు చేపట్టిన సర్వేలో ఆంధ్రప్రదేశ్లో మద్యం మత్తు పదార్థాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నివేదిక ఇవ్వటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.నార్కో ట్రెక్స్ కంట్రోల్ బ్యూరో నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి రవాణాలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నదని తెలిపారన్నారు.దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న గంజాయి మత్తు పదార్థాల రవాణాలో ఆంధ్రప్రదేశ్ నుండే జరుగుతుందని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తుందని ఆవేదన చెందారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికి  అన్నాన్ని అందించే అన్నపూర్ణగా రాష్ట్రంగా ఉండేదని ఇప్పుడు మత్తు పదార్థాలకు కేంద్రంగా నిలిచిందని చెడ్డపేరు వస్తుందని తెలిపారు.అప్పుల ఊభిలో కూరికపోయిన జగన్ ప్రభుత్వం చేస్తున్న మద్యం  వ్యాపార ఆదాయం ఎక్కడికి పోతుందని కనీసం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు మద్యం ఆదాయం సరిపోదా అని విమర్శించారు.