Jun 28,2023 15:25
  •  మాజీ మంత్రి రఘువీరా కుటుంబ సభ్యులు

ప్రజాశక్తి-మడకశిర రూరల్ : మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో బుధవారం రఘువీరా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నీలకంఠాపురం పీహెచ్సీలో 85 మంది గర్భిణులకు సామూహిక సీమంత మహోత్సవం నిర్వహించారు.వారి అందరితో కలిసి రఘువీర కోడలు దీక్షితకు  కూడా అక్కడే వారితో పాటు శ్రీమంతం చేయడం జరిగింది. వచ్చిన గర్భిణీ స్త్రీలకు వారందరికీ సాంప్రదాయబద్ధంగా పండ్లు, పూలు మరియు బేబీ కిడ్స్ పంపిణీ చేసి ఆశీర్వదించారు. 
ఈ సందర్భంగా రఘువీరా కోడెల దీక్షిత అమిత్ రఘువీరా మాట్లాడుతూ గర్భిణీలు బలమైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తద్వారా పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. రక్తహీనత గర్భిణీలకు ఒక సవాల్‌గా మారిందని, దీనిని అధిగమించాలన్నారు. వారం వారం వైద్యులతో తనిఖీలు నిర్వహించుకోవాలన్నారు. వారి సూచనలు పాటించాలన్నారు. నాతో పాటు కులమత భేదాలు లేకుండా ఇంతమందితో పాటు నాకు కూడా ఇక్కడే సామూహికంగా సీమంతాలు నిర్వహించడం చాలా సంతోషం అని అన్నారు. అనంతరం వారితో పాటు భోజనం చేసి గర్భిణీ స్త్రీలు తిని వదిలేసిన ఇస్తరాకులను రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు తీసివేసారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.