ప్రజాశక్తి-పాలకొల్లు : సీనియర్ పాత్రికేయులు విన్నకోట వెంకటేశ్వరరావు మృతికి పాలకొల్లు ప్రెస్ క్లబ్ సంతాపం వ్యక్తం చేసింది. బుధవారం ప్రెస్ క్లబ్లో నర్సింహరాజు అధ్యక్షతన జరిగిన సమావేశం ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పాత్రికేయునిగా, కళాకారునిగా, కార్మిక నేతగా ఆయన చేసిన సేవలను కొనియాడింది. ఇంకా కార్యదర్శి లాజరస్, కోశాధికారి తోట రాంబాబు, ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు పీటి వెంకటేశ్వరరావు,మండెల అప్పలరాజు,కాగిత సూర్య నారాయణ, మానాపురం సత్యనారాయణ, బుడ్డిగ గోపి, సరగం సత్యనారాయణ, సంతాపం వ్యక్తం చేశారు.










